: సమయం లేదు మిత్రమా...డైలాగ్ వింటే గుండె పులకించింది!: రాజమౌళి


ఈమధ్య కాలంలో టాలీవుడ్ జనాల్లో అత్యంత పాప్యులర్ అయిన డైలాగుల్లో టాప్ లో ఉన్న డైలాగ్, బాలయ్య తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో చెప్పిన 'సమయం లేదు మిత్రమా... శరణమా? రణమా?' అనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రంపై తన అభినందనలను లేఖ రూపంలో వెల్లడించిన రాజమౌళి ఈ డైలాగుపై ప్రశంసల వర్షం కురిపించాడు. తనను రెండు గంటల పాటు మొదటి శతాబ్దంలోకి ఈ చిత్రం తీసుకెళ్లిందని, అక్కడ తనకు తెలిసిన బాలకృష్ణ లేడని, సాక్షాత్తూ శక పురుషుడు శాతకర్ణి సార్వభౌముడినే తాను చూశానని అన్నాడు.

సమయం లేదు మిత్రమా... అన్న డైలాగ్ వింటుంటే సగటు సినీ అభిమానిలా తన గుండె పులకించిందని, బాలకృష్ణ గుర్రం మీద కూర్చొని తన కుమారుడు చెప్పే కథ వినే సన్నివేశంలో తనకు హీరోయిజంలోనే సరికొత్త కోణం కనిపించిందని చెప్పాడు. చరిత్రపై సినిమా అంటే డాక్యుమెంటరీలా ఉంటుందన్న భావన తన మనసు నుంచి క్రిష్ తొలగించాడని అన్నాడు. తెలుగువాడిగా తన మీసాన్ని కూడా మెలేయాలని అనిపించిందని కొనియాడాడు.

  • Loading...

More Telugu News