: అప్పట్లో ట్రంప్ నేనంటే నిజంగా పడి చచ్చేవాడు!: హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టెన్
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాలుగేళ్ల క్రితం తానంటే పడి చచ్చేవాడని హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టెన్ స్టెవార్డ్ చెబుతోంది. అప్పట్లో ట్రంప్ చేసిన 'తుంటరి ట్వీట్'లను మరోసారి గుర్తుకు తెచ్చుకుందీ హాట్ బ్యూటీ. ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత, క్రిస్టెన్ మీడియాతో మాట్లాడుతూ, 2012లో ట్రంప్ రియాలిటీ షోలు చేస్తున్న వేళ, తాను చిన్న నటినని, ఆ సమయంలో నిజంగా తానంటే ట్రంప్ పడి చచ్చేవాడని గర్వంగా చెప్పుకుంది. 2008 నుంచి తనతో సహజీవనం చేసిన రాబర్ట్ ప్యాటిన్ సన్ తో మనస్పర్థలు వచ్చి విడిపోయిన తరువాత, ట్రంప్ స్పందించాడని గుర్తు చేసుకుంది.