: కొత్త పదవిలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్
బీసీసీఐ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ను కొత్త పదవి వరించింది. హిమాచల్ ప్రదేశ్ ఒలింపిక్ సంఘం (హెచ్పీఓఏ) అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేటి నుంచి నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ ఎన్నికలకు భారత ఒలింపిక్ సంఘం నుంచి నిర్వాన్ ముఖర్జీ పరిశీలకుడిగా వచ్చారు.
ఇక ఈ ఎన్నికల్లో సీనియర్ ఉపాధ్యక్షుడిగా వీరేందర్ కన్వార్, ప్రధాన కార్యదర్శిగా రాజేశ్ భండారి ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కాగా, బీసీసీఐ లో జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలులో అలసత్వం వహించడంతో సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఆయనను బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.