: టీమిండియా పేసర్ షమీని ఇబ్బందుల్లోకి నెట్టిన 'కుక్కతో ఫోటో'!


టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోషల్ మీడియాలో ఏ ఫోటో పోస్టు చేసినా వివాదాస్పదమవుతోంది. ఈ మధ్యే దేవుడు తనకు అందమైన భార్యాబిడ్డలను ఇచ్చాడని పేర్కొంటూ పోస్టు చేసిన ఫోటోపై ముస్లిం వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సమయంలో షమీకి కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. తాజాగా కుక్కలంటే తనకు చాలా ఇష్టమని, అందరూ వాటిని ప్రేమించాలని పేర్కొంటూ భద్రతా దళాలకు చెందినఓ కుక్కపై చేయిపెట్టి ఉండగా తీసిన ఫోటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది సోషల్ మీడియాలోని ముస్లిం వర్గాలను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో షమీపై మళ్లీ విమర్శలు మొదలుపెట్టారు. ఇస్లాంకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నావంటూ మండిపడ్డారు. 'నువ్వసలు ముస్లింవేనా?' అంటూ కొందరు ప్రశ్నించారు. మరికొందరు షమీకి మద్దతు తెలిపారు.

  • Loading...

More Telugu News