: మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమవుతున్న సుస్మితాసేన్!
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ మళ్లీ పోటీలకు సిద్ధమవ్వడమేంటన్న అనుమానం వచ్చిందా? అవును, ఆమె మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సారి పోటీ పడేందుకు సిద్ధంకావడం లేదు. పోటీల్లో విజేతను నిర్ణయించేందుకు ఆమె సిద్ధమవుతోంది. 1994లో మిస్ యూనివర్స్ గా ఎంపికైన సుస్మితాసేన్ బాలీవుడ్ లో వివిధ సినిమాల్లో నటించి అలరించింది. 23 ఏళ్ల తరువాత మిస్ యూనివర్స్ పోటీల్లో న్యాయనిర్ణేతల ప్యానల్ సభ్యురాలు అయింది. దీంతో 23 ఏళ్ల తరువాత తాను గెలిచిన గడ్డపైకి వెళ్తున్నానని, పుట్టింటికి వెళ్తున్న ఆనందంగా ఉందని తన్ ఇన్ స్టా గ్రాంలో పేర్కొంది. ఈ నెల 30న ఫిలిప్పీన్స్ లో మిస్ యూనివర్స్ పోటీలు జరగనుండగా, భారత్ తరపున రోష్మిత హరిమూర్తి ఈ పోటీల్లో పాల్గొంటోంది.