: మోదీ తీరు నిరాశపరిచిందన్న అన్నాడీఎంకే


జల్లికట్టుకు సంబంధించి తమ ఎంపీలు ఏడాది కాలంగా ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారని... కానీ, మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అన్నాడీఎంకే నేత తంబిదురై ఆరోపించారు. మోదీ తీరు తమకు తీవ్ర నిరాశను మిగిల్చిందని చెప్పారు. జల్లికట్టు కోసం త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. జల్లికట్టు అంశాన్ని పరిష్కరించాలని అమ్మ జయలలిత గతంలోనే కేంద్రాన్ని కోరారని... కానీ, కేంద్ర ప్రభుత్వం తమ వినతిని పట్టించుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తంబిదురై విమర్శించారు. 

  • Loading...

More Telugu News