: నైజీరియా భాషలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం నాదే: సంపూర్ణేష్ బాబు
నైజీరియా భాషలో విడుదల అవుతున్న తొలి తెలుగు చిత్రం తన ‘కొబ్బరిమట్ట’ అని సినీ హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు అన్నాడు. చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ ప్రాంతీయ భాషల్లో విడుదల చేయనున్నామన్నారు. అంతేకాకుండా, ‘కొబ్బరి మట్ట’ను నైజీరియా భాషలో కూడా విడుదల చేస్తున్నామని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ చిత్రం డబ్బింగ్ పూర్తయిందని, ఈ చిత్రంలో నటించినందుకు తన మనసు ఆనందంతో పులకిస్తోందని, జీవితానికిది చాలని అన్నారు. ‘కొబ్బరి మట్ట’ను తమిళ, కన్నడ, నైజీరియా భాషల్లోకి అనువదిస్తున్నామని చెప్పడం తనకు సంతోషంగా ఉందన్నారు. ‘‘కొబ్బరి మట్ట’ లేటు అయి ఉండొచ్చు, కానీ, సెన్సేషన్ అవడం ఖాయం. ఇది, నా గుండె గుద్ది చెబుతున్నమాట’ అని సంపూ పేర్కొన్నాడు.