: మరో రికార్డును సాధించిన 'దంగల్'
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' మరో రికార్డును సాధించింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ సినిమా రూ. 375 కోట్ల మార్కును దాటింది. 5వ వారానికి రూ. 376.14 కోట్ల వసూళ్లను సాధించింది. ఇన్నాళ్లు పెద్ద నోట్ల రద్దుతో డీలా పడ్డ థియేటర్ యాజమాన్యాలు... దంగల్ కలెక్షన్లతో సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా ఘన విజయం పట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు అమీర్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ కూడా రాశారు.