: ధోనీని క్షమిస్తున్నా: యువరాజ్ తండ్రి


క్రికెటర్ ధోనీపై గతంలో ఘాటు విమర్శలు చేసిన యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ తన మనసు మార్చుకున్నారు. భారత జట్టులో యువీ స్థానం కోల్పోవడానికి ధోనీనే కారణమని గతంలో యోగ్ రాజ్ ఆరోపించారు. ఇప్పుడు ధోనీని తాను క్షమిస్తున్నానని... ధోనీని దేవుడు కాపాడాలని కోరారు. కటక్ మ్యాచ్ లో ధోనీ సెంచరీ చేయాలని తాను కూడా కోరుకున్నానని ఆయన తెలిపారు. ధోనీకి దేవుడు వెన్నంటి ఉండి, అతనికి మేలు చేయాలని కోరారు. మూడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు యువీ దూరం కావడానికి ధోనీనే కారణమని... ఆ విషయాన్ని ధోనీ గ్రహించి, దేవుడికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. తన పిల్లలకు చెడు చేసేవారిని తాను క్షమిస్తానని తెలిపారు. యువీకి అనునిత్యం అండగా నిలిచిన తన కోడలు హాజెల్ కీచ్ కు అభినందనలు తెలిపారు. యువీ, హాజెల్ ఎప్పుడూ ఇలాగే కలసి ఉండాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News