: ఢిల్లీలో మరో దారుణం... విద్యార్థినిపై విదేశీయుల అత్యాచారం!


దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్ దేశీయులు అత్యాచారం జరిపారు. వివరాల్లోకి వెళ్తే బీఏ (ఆనర్స్) సెకండ్ ఇయర్ చదువుతున్న బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి ఒక పబ్ కు వెళ్లింది. అక్కడ ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన త్వాబ్ అహ్మద్ (27) పరిచయం అయ్యాడు. తమ ఇంట్లో పార్టీ ఉందని రమ్మని పిలిచాడు. ఇంటికి వెళ్లే సరికి అక్కడ అతని స్నేహితుడు కూడా ఉన్నాడు.

బాధితురాలి స్నేహితురాలు అక్కడ నుంచి తిరిగి జేఎన్ యూకు వెళ్లిపోయింది. బాధితురాలు మాత్రం అక్కడే ఉండి మద్యం సేవించింది. తెల్లవారుజామున మెలకువ వచ్చేసరికి అహ్మద్ స్నేహితుడు సులేమాన్ తనపై  అత్యాచారం చేస్తున్నట్టు  ఆమెకు  తెలిసింది. తాను మత్తులో ఉన్నప్పుడు అహ్మద్, సులేమాన్ ఇద్దరూ అత్యాచారం జరిపినట్టు ఆమె గుర్తించింది. తిరిగి హాస్టల్ కు వెళ్లి పోయిన తర్వాత, జరిగిన విషయాన్ని తన స్నేహతులకు చెప్పింది. దీంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అహ్మద్, సులేమాన్ లను అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.

  • Loading...

More Telugu News