: హెచ్1బీ వీసాలు మరింత కఠినతరం.. బిల్లు రెడీ అవుతోంది!
అమెరికాలో ట్రంప్ శకం ప్రారంభమయింది. ఆయన చెప్పినట్టుగానే విదేశీయులకు హెచ్1బీ వీసాలను జారీ చేసే ప్రక్రియ కఠినతరం కాబోతోంది. ఇందుకు సంబంధించిన కీలక బిల్లు రాబోతోంది. దీనికి చట్టబద్ధత తెచ్చే దిశగా ఇప్పటికే సెనేటర్లు డిక్ డర్బన్, చుక్ గ్రాస్లేలు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ బిల్లు ప్రకారం అక్కడున్న యూనివర్శిటీల్లో చదివిన విదేశీ విద్యార్థులకే హెచ్1బీ వీసా జారీలో ప్రాధాన్యత ఇస్తారు. దీనికి తోడు, అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి, అధిక వేతనం పొందే వారికి మాత్రమే అవకాశం ఇస్తారు. అక్కడ పనిచేసే నిపుణుల కోసం బయట వారి కంటే అక్కడ చదివిన వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ఔట్ సోర్సింగ్ కంపెనీలకు అదనంగా హెచ్1బీ, ఎల్1 వీసాలున్న వారిని నియమించుకోవడానికి నిబంధనలు అనుమతించవు.