: 'ట్రంప్ దేశానికి చెడ్డ ఉదాహరణ' అంటున్న హాలీవుడ్ సీనియర్ నటుడు
అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ దేశానికి, న్యూయార్క్ నగరానికి చెడ్డ ఉదాహరణ అని హాలీవుడ్ సీనియర్ నటుడు రాబర్ట్ డీ నీరో మండిపడ్డారు. న్యూయార్క్ లోని ట్రంప్ టవర్స్ వద్ద భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడం శోచనీయమని అన్నారు. తరువాత మరో హాలీవుడ్ నటుడు మైఖేల్ మూర్ మాట్లాడుతూ, ప్రస్తుతం అమెరికా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని అన్నారు. పరిస్థితి అనుకున్నదానికంటే ప్రమాదకరంగా ఉందని చెప్పారు. అందులో కూడా సానుకూలాంశమేంటంటే, వారి (ట్రంప్ మద్దతు దారుల) కంటే మనమే (ట్రంప్ వ్యతిరేకులు) ఎక్కువ మంది ఉండడమని అన్నారు. ఈ కార్యక్రమంలో హాలీవుడ్ నటీమణులు షైలీన్ వుడ్‌లీ, మారిసా తోమె, జులియన్ మూర్ తో పాటు అలెక్ బల్దివిన్, మార్క్ రఫెలో తదితర ప్రముఖులు హాజరయ్యారు.