: తేనెటీగల దాడిలో తెలంగాణ నేతలకు స్వల్ప గాయాలు


తేనే టీగల దాడిలో టీఆర్ఎస్ నేతలు స్వల్పంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి శివారులోని మామిడితోటలో రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలను ప్రారంభించేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్ వెళ్లారు. ఒక్కసారిగా తేనేటీగలు దాడి చేశాయి. వాటి నుంచి వారు తప్పించుకునే లోపే తేనెటీగలు తమ ప్రతాపం చూపాయి. దీంతో, నాయకులు తమ వాహనాల్లోకి పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ సంఘటనలో కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్, పలువురు టీఆర్ఎస్ నాయకులు, పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో, స్థానిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు.

  • Loading...

More Telugu News