: సినిమా ఇండస్ట్రీలో మా ఇద్దరిని ‘ట్విన్స్’ అని పిలుస్తుంటారు: నటుడు రాజేంద్ర ప్రసాద్
సీనియర్ నటుడు నరేష్ ని, తనను సినిమా ఇండస్ట్రీలో ‘ట్విన్స్’ అని పిలుస్తుంటారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నరేష్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘నరేష్ పుట్టిన రోజు అంటే నా పుట్టినరోజే.. అంత ఆనందంగా ఉంది. మొదటి నుంచి జంధ్యాల గారి సినిమాల్లో మేమిద్దరం హీరోలుగా చేశాం. సినిమాల్లోకి నేను రాక ముందు నుంచే అత్యంత సన్నిహిత మిత్రుడు నరేష్. ఒక నటుడి నటన, గొప్పతనం, పవర్ గురించి చెప్పాలంటే వారి ఫ్యాన్స్ ని చూసే చెప్పాలి. ఆ విషయంలో మా అందరికీ ఆరాధ్య దైవం లాంటి వారు మా కృష్ణ అన్నయ్య. కృష్ణ గారికి నేనంటే ఎంతో ప్రాణం, అది నేను చేసుకున్న పుణ్యం’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.