: ఇంటి దొంగ‌ల ప‌నే... పెట్రోలు బంకులో రూ.22 ల‌క్ష‌ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు


మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలోని ఓ పెట్రోల్ బంకులో గతనెల 12న దోపిడీ దొంగలు 22 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లినట్లు స‌ద‌రు బంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ దోపిడీ చేసింది బంకు సిబ్బందేన‌ని తేల్చారు. ఈ దోపిడీకి పాల్పడిన బంకు మేనేజర్ సత్యనారాయణతోపాటు మరో ఆరుగురిని ఈ రోజు అదుపులోకి తీసుకున్న‌ట్లు బాలానగర్ డీసీపీ సాయి శేఖర్ తెలిపారు. వారి నుంచి 2,00,060 వేల రూపాయల న‌గ‌దుతో పాటు ఓ ఇండికా కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  
 
గతనెల 12న తాము ప‌నిచేస్తోన్న భారత్ పెట్రోల్ బంక్‌లోకి ప్ర‌వేశించిన దోపిడీ దొంగలు 22 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లినట్లు బంకు సిబ్బంది త‌మ‌కు ఫిర్యాదు చేశార‌ని, కానీ ఈ చోరీని పెట్రోలు బంకు సిబ్బందే ప్లాన్ వేసుకొని చేశారని ఆయ‌న చెప్పారు. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురిని అరెస్టు చేశామ‌ని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News