: ఈ-సిగరెట్ తాగి పళ్లు ఊడగొట్టుకున్నాడు... అలా చేయకూడదని ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు!
రోజూలాగే మామూలుగా నోట్లో ఈ-సిగరెట్ పెట్టుకున్నాడు ఇడాహోలోని పొకటెలోకు చెందిన ఆండ్రూ హాల్. హాయిగా పొగతాగుతూ మజా చేద్దాం అనుకున్నాడు. అయితే, ఆ ఈ-సిగరెట్టు ఒక్కసారిగా ఠప్ మని పేలిపోయింది. అంతే, అతడి నోట్లోంచి 7 పళ్లు
ఊడి పడ్డాయి. దానికి తోడు అతడి ముఖం కాలిపోయింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం ఇంటికి తిరిగొచ్చిన ఆండ్రూ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సిగరెట్టు తాగకూడదని, తాగితే తనలా అయిపోతారని ప్రచారం చేస్తున్నాడు. ఈ-సిగరెట్లను పట్టుకొని వాటిని కాల్చుతూనే 'ఇలా చేయకూడదు' అని చెబుతున్నాడు. సోషల్మీడియాలో ఆండ్రూ చేస్తోన్న ప్రచారాన్ని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు.