: ‘జల్లికట్టు’పై తీర్పును వాయిదా వేసిన సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ‘జల్లికట్టు’పై తీర్పును వారం రోజుల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తమిళనాడులో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సుప్రీంకోర్టు సూచించింది. కాగా, ‘జల్లికట్టు’పై నిషేధం ఎత్తివేయాలంటూ తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బంద్ పాటిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు, సినీ రంగానికి చెందిన నటీనటులు తమ మద్దతు ప్రకటించడమే కాకుండా, నిరసన కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొంటున్నారు.