: తొలి వికెట్ తీసిన బుమ్రా...ఇంగ్లండ్ 66/1


కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 382 పరుగుల విజయ లక్ష్యంతో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు మూడో ఓవర్ లో జస్ ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. షాట్లతో అలరించే ప్రయత్నం చేస్తున్న హేల్స్ ను అవుట్ చేశాడు. బుమ్రా వేసిన షార్ట్ లెంగ్త్ బాల్ ను కట్ చేసేందుకు ప్రయత్నించిన హేల్స్ (14) ధోనీ చేతికి చిక్కి పెవిలియన్ కు చేరాడు. దీంతో కేవలం 28 పరుగుల వద్ద ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం జాసన్ రాయ్ (19), జో రూట్ (25) జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో ఇంగ్లండ్ జట్టు తొలి పది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 66 పరుగులు చేసింది. బుమ్రా ఒక వికెట్ తీశాడు. 

  • Loading...

More Telugu News