: రికార్డు మెరుగుపరుచుకున్న రియల్ హీరో యువరాజ్ సింగ్!


రియల్ స్టార్ యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ జట్టుపై వ్యక్తిగత పరుగుల రికార్డును మెరుగుపరుచుకున్నాడు. ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారి బారినపడిన తరువాత కోలుకోవడం కష్టమైన తరుణంలో దానితో పోరాడి విజయం సాధించిన యువరాజ్ మళ్లీ మైదానంలో కాలుపెట్టడమే అద్భుతమైతే....తన పూర్వపు స్థాయి ఆటతీరును ప్రదర్శించడం మరో అద్భుతం. క్యాన్సర్ నయమైనప్పటికీ దాని నుంచి పూర్తి స్థాయిలో కోలుకుని, స్టామినా తెచ్చుకోవడం అన్నది మాటలు కాదు. అయితే, యువరాజ్ సింగ్ ఎలాంటి అలసటకు లోను కాకుండా, ఎంతోసేపు మైదానంలో నిలబడి.. అద్భుతమైన టెక్నిక్ కు క్లాస్ ను జత చేస్తూ సెంచరీ సాధించడం ఒక ఎత్తైతే.. ఆ తరువాత భారీ షాట్లు ఆడుతూ, 2008లో ఇంగ్లండ్ జట్టుపై తాను సాధించిన 138 పరుగుల రికార్డును కేవలం 117 బంతుల్లో 142 పరుగులతో అధిగమించడం విశేషం. మరో ఎండ్ లో ధోనీ 96 బంతుల్లో 85 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 40 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News