: రాజధాని లో ఇల్లు కొనుక్కుంటా..ఇక్కడే ఉంటా: వైఎస్ జగన్
రాబోయే రోజుల్లో ఏపీ రాజధాని అమరావతిలో తాను ఇల్లు కొనుక్కుంటానని, ఇక్కడే ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా నిడమర్రులో రైతులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నారని, తాను మాత్రం రాబోయే రోజుల్లో సొంత ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటానని అనడంతో రైతుల చప్పట్లతో మార్మోగిపోయింది.
తాము అధికారంలోకి రాగానే ప్రజా రాజధానిని నిర్మిస్తామని, తమ పార్టీ ద్వారానే రాజధానిలో మంచి జరుగుతుందని అన్నారు. చంద్రబాబు ఇక్కడి రైతుల కళ్లలో కన్నీళ్లు చూస్తున్నారని, ఈ పరిస్థితిని తాను మారుస్తానని, రాజధాని రైతులకు అన్యాయం జరగనీయనని, వారికి అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. మరో రెండేళ్ల పాటు రైతులు తమ భూములను కాపాడుకుంటే చాలని, ఆ తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వారు నిశ్చింతగా ఉండొచ్చని జగన్ అన్నారు.