: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
భారత్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కటక్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి వన్డే మ్యాచ్‌లో భారీగా పరుగులు రాబట్టినప్పటికీ టీమిండియా చేతిలో ఇంగ్లండ్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనయినా గెలిచి వన్డే సిరీస్ కోల్పోకుండా ఉండాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు తీవ్ర కసరత్తు చేశారు. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. టీమిండియాలో బౌలర్ ఉమేష్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ జట్టులో రషీద్ స్థానంలో ప్లంకెట్ ను జట్టులోకి తీసుకున్నారు.