china: ‘ఇరుపక్షాలు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది’.. ట్రంప్‌ను హెచ్చ‌రించిన‌ చైనా వ్యాపార దిగ్గ‌జం


త్వ‌ర‌లోనే అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టనున్న డొనాల్డ్ ట్రంప్ అనుస‌రించాల‌నుకుంటున్న విధానాల‌పై చైనాకు చెందిన వ్యాపారి, హాలీవుడ్‌ పెట్టుబడిదారు వాంగ్‌ జియాలిన్ విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ప‌లు హెచ్చ‌రిక‌లు చేశారు. ట్రంప్‌ వాణిజ్య యుద్ధాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయ‌న‌... వినోద పరిశ్రమను ట్రేడ్‌వార్‌లోకి లాగటాన్ని ఖండించారు. అమెరికాలోని లక్షలమంది సినీ ప్రేమికుల చేతుల్లో చిత్రపరిశ్రమ భవిష్యత్తు ఉంద‌ని, ఒక వేళ అమెరికా వినోద పరిశ్రమ ఈ యుద్ధంలోకి దిగితే అమెరికాయే తీవ్రంగా నష్టపోతుంద‌ని హెచ్చ‌రించారు. ఆమెరికా త‌రువాత‌ ఆంగ్ల సినిమా చైనాలోనే వేగంగా ఎదుగుతోందని, 2016లో ఒక్క చైనాలోనే దాదాపు 15,000 కొత్త స్క్రీన్‌లు ఏర్పాటు చేశారని చెప్పారు. ట్రంప్ అనుస‌రించాల‌నుకుంటున్న విధానాల‌తో చైనా నుంచి కూడా ప్రతిఘటన ఉంటే ఇరుపక్షాలు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితి ఉండ‌కూడ‌ద‌ని సూచించారు.

  • Loading...

More Telugu News