: సిరీస్ పై భారత్ కన్ను.. సమం చేయాలనే లక్ష్యంతో ఇంగ్లండ్.. రెండో వన్డే నేడే


భారత్-ఇంగ్లండ్ ల మధ్య రెండో వన్డే నేడు కటక్ లోని బారాబతి స్టేడియంలో జరగబోతోంది. మధ్యాహ్నం 1.20 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి వన్డేలో అద్భుత విజయాన్ని సాధించిన టీమిండియా, ఈ మ్యాచ్ ను కూడా గెలిచి మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు, ఈ మ్యాచ్ లో విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని ఇంగ్లండ్ చూస్తోంది. ఏదేమైనప్పటికీ, తొలి వన్డేలో 350 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ ఓడిపోవడం, ఇంగ్లండ్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టివేసింది. వన్డే నేపథ్యంలో, బారాబతి స్టేడియం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  

  • Loading...

More Telugu News