: నాకు నిజంగానే పెళ్లి జరుగుతోందేమోనని భయపడ్డా: హీరోయిన్ తాప్సి
తాజాగా జరిగిన ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ తనకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించిందని అందాలతార తాప్సి తెలిపింది. ఎవరికీ చెప్పకుండానే తాప్సి పెళ్లి చేసుకుంటోందా? అనే డౌటు వచ్చిందా? అదేమీ కాదులెండి. ఇదంతా ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'రన్నింగ్ షాదీ డాట్ కామ్' సినిమా ప్రమోషన్ ఈవెంట్ లోనే సుమా. ప్రమోషన్ లో భాగంగా, పెళ్లికి ముందు జరిపే సంగీత్ తదితర ఈవెంట్లలో ఈ భామ పాల్గొంటోంది. అక్కడున్న వాతావరణం చూసి, నిజంగానే తనకు పెళ్లి జరుగుతోందేమో అని ఆందోళన చెందానని చెప్పింది తాప్సి. ఇది కేవలం సినిమా కోసమే చేస్తున్నారనే విషయం గుర్తుకొచ్చి, ఆ తర్వాత ఈవెంట్ ను ఫుల్ ఎంజాయ్ చేశానని చెప్పింది. అయితే ఈ ఉత్తిత్తి పెళ్లిని కూడా తాను ఎన్నటికీ మరిచిపోనని తెలిపింది.