: అద్భుత ప్ర‌యోగానికి స‌ర్వం సిద్ధం చేస్తున్న ఇస్రో.. షార్‌కు చేరుకున్న వంద విదేశీ ఉపగ్ర‌హాలు


అత్య‌ద్భుత ప్ర‌యోగానికి సిద్ధ‌మైన ఇస్రో అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేసింది. వ‌చ్చే నెల 8న ఉద‌యం 8.39 గంట‌ల‌కు పీఎస్ఎల్వీ-సీ37 వాహ‌క నౌక ద్వారా ఒకేసారి 103 ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించ‌నుంది. ఇస్రో ప్ర‌యోగించ‌నున్న 103 ఉప‌గ్ర‌హాల్లో వంద ఉప‌గ్ర‌హాలు విదేశాల‌కు చెందిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. మ‌న దేశానికి చెందిన మూడు ఉప‌గ్రహాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇస్రో ప్రయోగించ‌నున్న వంద విదేశీ ఉప‌గ్ర‌హాలు బుధ‌వారం తెల్ల‌వారుజామున నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రానికి చేరుకున్నాయి. వీటిలో అమెరికా, క‌జ‌కిస్థాన్‌, నెద‌ర్లాండ్స్‌, స్విట్జ‌ర్లాండ్ త‌దిత‌ర దేశాల‌కు చెందిన శాటిలైట్లు ఉన్నాయి. ఈ ప్ర‌యోగం కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురుచూస్తోంది.

  • Loading...

More Telugu News