: కుస్తీ పోటీలో సత్తాచాటిన బాబా రామ్‌దేవ్.. స్టాద్నిక్‌పై భారీ విజయం
యోగా గురువు బాబా రామ్‌దేవ్ కుస్తీపోటీలోనూ తన సత్తా చాటారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ ప్రచార బౌట్లో 2008 ఒలింపిక్ రజత పతక విజేత అయిన స్టాద్నిక్‌తో తలపడి మట్టికరిపించారు. స్నేహపూర్వకంగా జరిగిన ఈ మ్యాచ్‌లో బాబా రామ్‌దేవ్ 12-0తో ప్రత్యర్థిని ఓడించి విజయం సాధించారు. ఈ పోటీ ప్రచారం కోసం నిర్వహించినది కావడంతో బాబా విజయానికి స్టాద్నిక్ పూర్తి సహకారం అందించారు. ఈ పోటీని చూసేందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రొఫెషనల్ రెజ్లర్‌లా తలపడుతున్న బాబా రామ్‌దేవ్‌ను చూసి అంతా ఆశ్చర్యపోయారు.