: తన విద్యార్హత బయటపెట్టవద్దంటూ ఢిల్లీ వర్సిటీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లేఖ
సమాచార హక్కు చట్టం ప్రకారం తన విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి రికార్డులను బయటపెట్టవద్దని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీ యూనివర్సిటీకి లేఖ రాశారు. స్మృతి విద్యార్హతలకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్మృతి 10, 12వ తరగతులకు సంబంధించి సర్టిఫికెట్లను తనిఖీ చేసుకోవచ్చంటూ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్న నేపథ్యంలో స్పందించిన కేంద్రమంత్రి వర్సిటీకి లేఖ రాశారు.