: రేపు ఢిల్లీకి వెళ్లనున్న తమిళ రాజకీయ, సినీ బృందాలు


తమిళ రాజకీయాలు హస్తినకు తరలనున్నాయి. జల్లికట్టు వివాదం రాజుకోవడంతో తమిళనాట అధికారపార్టీ కీలక నేతలు, ఎంపీలతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కీలక నేతలను కలిసి జల్లికట్టుపై ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రయత్నించనున్నారు. మరోవైపు ప్రధానిని కలిసేందుకు నడిగర్ సంఘం నేతలు కూడా హస్తినకేగనున్నారు. పలువురు సినీ ప్రముఖుల బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి జల్లికట్టు గురించి వివరించనున్నారు. జల్లికట్టు సంప్రదాయాన్ని కొనసాగించాలని వారంతా ప్రధానిని కోరతారు. కాగా, తమిళనాట జల్లికట్టు ఉద్యమం తీవ్రమవుతోంది. 

  • Loading...

More Telugu News