: కోహ్లీ కంటే సచినే గొప్ప ఎందుకంటే..!: పాక్ మాజీ క్రికెటర్ విశ్లేషణ


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అనితర సాధ్యమైన ఫాంతో కోహ్లీ దూసుకుపోతుండడంతో క్రికెట్ దేవుడిగా నీరాజనాలందుకున్న సచిన్ టెండూల్కర్ తో కోహ్లీని పోలుస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ ఒక క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడని,  అయితే సచిన్ అంత అద్భుతమైన ఆటగాడు కాదని చెప్పాడు.

సచిన్ ప్రపంచంలోని అన్ని జట్లలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొన్నాడని తెలిపాడు. ఇప్పుడంత నాణ్యమైన బౌలర్లు లేరని తెలిపాడు. సచిన్ ఎంత గొప్ప ఆటగాడో అతని సెంచరీలు, పరుగులే చెబుతాయని యూసఫ్ పేర్కొన్నాడు. ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే అయినా సచిన్ తో కోహ్లీకి పోలిక లేదని స్పష్టం చేశాడు. 90ల్లో బౌలర్లంత నాణ్యమైన బౌలర్లు ఇప్పుడు లేరని తెలిపాడు. అప్పటి వారిని ఎదుర్కోవడం ఎవరికైనా సవాలేనని, సచిన్ ఆ సవాళ్లన్నింటినీ అవలీలగా అధిగమించాడని యూసఫ్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News