: ‘హెరిటేజ్’ నియమ నిబంధనలతో నడుస్తున్న సంస్థ: ప్రత్తిపాటి పుల్లారావు


ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ‘హెరిటేజ్’ నియమ నిబంధనలతో నడుస్తున్న సంస్థ అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. హెరిటేజ్ సంస్థపై  వైఎస్సార్సీపీ నాయకులు చేసిన  ఆరోపణలను ఆయన ఖండించారు. ఎవరు పచ్చగా ఉన్నా వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఓర్వలేరని, ఇప్పటికైనా జగన్ మారాలని ఆయన హితవు పలికారు. చంద్రబాబు విదేశాల్లో డబ్బు దాచుకున్నారనడం సిగ్గుచేటని, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని ఆయన అన్నారు. కాగా, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి   నివాళులర్పించారు. 

  • Loading...

More Telugu News