: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదాపడ్డాయి. నేడు మైనార్టీ సంక్షేమంపై శాసనసభలో వాడీ వేడి చర్చ జరిగింది. 18 రోజులపాటు సభాసమావేశాలు నిర్వహించగా, అందులో 94 గంటల 56 నిమిషాలపాటు సభ సజావుగా నడిచింది. ఇందులో 16 అంశాలపై చర్చించగా, 16 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు 186 ప్రశ్నలు సంధించారు. మైనార్టీ సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. దీంతో తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి.