: నోయిడాలో పిజ్జా డెలివరీ అంటే భయపడిపోతున్న డెలివరీ బాయ్స్
సాధారణంగా దొంగతనం, దోపిడీ వంటివి డబ్బులు దోచుకునేందుకు చేస్తుంటారు. చిత్రంగా ఢిల్లీ శివారు నోయిడాలో మాత్రం పిజ్జాలను దోచుకుపోతుండడంతో అక్కడి పిజ్జా డెలివరీ బాయ్స్ బెంబేలెత్తిపోతున్నారు. నోయిడాలోని ఏదో ఒక చోట ప్రతి రోజూ పిజ్జా దొంగతనం జరుగుతోందని, వారంలో కనీసం 12 వరకు పిజ్జాలను దోచుకుపోతుంటారని పిజ్జా డెలివరీ బాయ్స్ చెప్పారు. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా సాయుధులైన యువకులు వచ్చి బెదిరింపులకు దిగుతారని, ఎదురు తిరిగితే దాడి చేసి పిజ్జాలు దోచుకుపోతారని తెలిపారు. అయితే, వీటిని తేలిగ్గా తీసుకుని ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని, దోపిడీదారుల ఆగడాలు మాత్రం భరించలేకపోతున్నామని వారు తెలిపారు.