: ఆ రూమర్ నిజమైతే బాగుంటుంది!: బాలీవుడ్ భామ వాణీకపూర్
ఈ మధ్యకాలంలో తన విషయంలో వచ్చిన రూమర్ నిజమైతే బాగుండునని బాలీవుడ్ నటి వాణీకపూర్ కోరుకుంటోంది. 'ఆహా కల్యాణం' సినిమాతో నాని సరసన తెలుగులో కనిపించిన వాణీ కపూర్ ఈ మధ్య 'బేఫిక్రే' అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఆ సినిమా ఊహించిన విజయం సాధించలేదు. ఆ సినిమా తరువాత బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సినిమాలో నటించనుందని, ఆ ప్రాజెక్టుపై సంతకం కూడా చేసిందని బాలీవుడ్ కధనాలు పేర్కొన్నాయి. దీనిపై వాణీ కపూర్ స్పందిస్తూ, ఈ రూమర్ చాలా బాగుందని చెప్పింది. అయితే, అలాంటిదేమీ లేదని చెప్పిన వాణీ, ఈ రూమర్ నిజమైతే బాగుండునని వ్యాఖ్యానించింది. ఇంత వరకు తానే సినిమాకి సంతకం చేయలేదని, అలా చేస్తే చెబుతానని తెలిపింది.