: తమ సైన్యం 48 గంటల్లో ఢిల్లీలో అడుగుపెడుతుందన్న చైనా మీడియా.. ట్వీట్లతో డ్రాగన్ కంట్రీ గాలి తీసేసిన నెటిజన్లు!
ఎందుకనో ఇటీవల చైనా మీడియా భారత్ అంటే అంతెత్తున లేస్తోంది. సమయం, సందర్భం లేకుండా నోటికొచ్చింది రాస్తోంది. బహుశా ఇటీవల భారత్ పరీక్షించిన అగ్ని 5 ఎఫెక్టేమో! చైనా సైన్యం గొప్పతనాన్ని వివరిస్తూ యుద్ధం అంటూ జరిగితే పీపుల్స్ ఆర్మీ 48 గంటల్లో ఢిల్లీలో అడుగుపెడుతుందంటూ డ్రాగన్ కంట్రీ మీడియా జబ్బలు చరుచుకుంటూ అసందర్భ వార్త ఒకటి తాజాగా ప్రచురించింది. దీనిపై భారత్ నెటిజన్ల నుంచి సరదా ట్వీట్లు వెల్లువెత్తాయి. ట్వీట్లతో చైనా మీడియా గాలి తీసేశారు.
''బహుశా చైనాకు తెలియదేమో, ఢిల్లీలో ఎటుచూసినా ట్రాఫిక్ జాములే'' అంటూ ఒకరు ట్వీట్ చేయగా ''భారత్‌లో చేరడానికి చైనా సైన్యానికి 48 గంటలు పడితే ఢిల్లీలో అడుగుపెట్టడానికి మరో 48 గంటలు పడుతుంది. ఈ విషయం చైనాకు తెలియదేమో'' అని మరో ట్వీటరాటీ ట్వీటాడు. ''టైమ్ వేస్ట్ చేయడం కంటే రెక్కలు కట్టుకుని వాలేందుకు ప్రయత్నిస్తే మంచిదేమో'' అంటూ మరొకరు సలహా పడేశారు. ఢిల్లీలోని ట్రాఫిక్ జామ్‌లపై చైనాకు పరోక్షంగా తమ ట్వీట్ల ద్వారా తెలియజేస్తూ డ్రాగన్ కంట్రీ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోశారు.