: 'బ్రాంజెలీనా' కలిసి ఉంటే బాగుండేది: ఏంజెలీనా జోలీ తండ్రి ఆకాంక్ష


హాలీవుడ్ స్టార్ దంపతులు బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ (బ్రాంజెలీనా) కలిసి ఉంటే బాగుండేదని ఏంజెలీనా తండ్రి, సీనియర్ నటుడు జాన్ వోయిట్ ఆకాంక్షించారు. వీలైతే విడాకులను పక్కనపెట్టి ఇద్దరూ తన మనవళ్లు, మనవరాళ్లను చూసుకోవాలని కోరారు. వారి విడాకుల అనంతరం తొలిసారి నోరువిప్పిన ఆయన, వారిద్దరూ విడాకులు తీసుకోకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యే వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పిల్లల సంరక్షణ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే. జోలీ పిల్లల సంరక్షణ చూస్తానని చెబుతుండగా, తమ ఇద్దరికీ సమానంగా పిల్లల సంరక్షణ బాధ్యతలు అప్పగించాలని పిట్ డిమాండ్ చేస్తున్నాడు. కాగా, వీరికి ముగ్గురు పిల్లలు కాగా, మరో ముగ్గుర్ని దత్తత తీసుకున్నారు. విమానంలో ఫుల్లుగా తాగిన పిట్ దత్తపుత్రుడిపై విరుచుకుపడడంతో ఈ దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News