: సైకిల్ ను తన తండ్రి కొట్టేయకుండా సుప్రీంకోర్టు తలుపులు తట్టిన అఖిలేష్!
సమాజ్ వాదీ పార్టీ, ఆ పార్టీ గుర్తు రెండూ అఖిలేష్ సింగ్ యాదవ్ కే చెందుతాయంటూ ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ... అఖిలేష్ సింగ్ యాదవ్ మాత్రం ఛాన్స్ తీసుకోదలచుకోవడం లేదు. తనకు దక్కిన వాటిని నిలుపుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. ఎవరైనా సమాజ వాదీ పార్టీ అధ్యక్ష స్థానంపై కానీ, సైకిల్ గుర్తుపై కానీ కోర్టు మెట్లెక్కితే, తమ వాదనలు వినకుండా ఆదేశాలు జారీ చేయవద్దంటూ ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానంటూ ములాయం సింగ్ యాదవ్ హెచ్చరించిన నేపథ్యంలో... అఖిలేష్ సింగ్ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.