: 12 ఏళ్ల విద్యార్థిని జీవితాన్ని నాశనం చేసిన ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు!


పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే జంతువుల్లా ప్రవర్తించారు. విచక్షణ మరిచి 12 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి జరిపారు. ఈ దారుణ ఘటన బిహార్ లోని జెహనాబాద్ లో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ అజు అహ్మద్ తో పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులు అతుల్ రెహ్మాన్, అబ్దుల్ బరీ, హహ్మద్ షౌకత్ లు ఈ దారుణానికి ఒడిగట్టారు. నిన్న బాధిత బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమెను పాఠశాల భవనంపైకి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపారు. బాధితురాలు ఇబ్బందికర పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన ఆమె తల్లి, మరో ఉపాధ్యాయుడు ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో, జరిగిన విషయాన్ని మొత్తం ఆ బాలిక వారికి చెప్పింది. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. మరోవైపు, జరిగిన దారుణం గురించి తెలుసుకున్న స్థానికులు షాక్ కు గురయ్యారు. దారుణానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News