: గోవా - హైదరాబాద్ రూ. 877, బెంగళూరు - హైదరాబాద్ రూ. 663... ఎయిర్ ఆసియా '2017 ఎర్లీ బర్డ్ సేల్'


'2017 ఎర్లీ బర్డ్ సేల్'లో భాగంగా తక్కువ ధరకే విమాన ప్రయాణ అవకాశాన్ని అందించనున్నట్టు ఎయిర్ ఆసియా ప్రకటించింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ జనవరి 22తో ముగుస్తుందని, మే 1 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6 వరకూ ప్రయాణ తేదీని నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. ఇందులో భాగంగా, గోవా - హైదరాబాద్ మధ్య రూ. 877, బెంగళూరు - హైదరాబాద్ మధ్య రూ. 663కు టికెట్లు లభిస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో గౌహతి - ఇంఫాల్ నడుమ రూ. 407, జైపూర్ - పూణె మధ్య రూ. 2,516, పుణె - బెంగళూరు మధ్య రూ.821కే టికెట్లు అందుబాటులో ఉంచామని, తొలుత వచ్చిన వారికి తొలుత ప్రాతిపదికన ప్రతి సర్వీసులో పరిమిత టికెట్లను విక్రయిస్తున్నామని తెలియజేసింది.

  • Loading...

More Telugu News