: సినిమాలో ఆ లోపం ఉన్నమాట నిజమే: అంగీకరించిన బాలకృష్ణ
తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో బలమైన కథ, మెలోడ్రామా లేవని విమర్శకుల నుంచి వస్తున్న వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. చిత్రంలో గొప్ప కథ లేదన్న విషయం నిజమేనని, అది లోపమే అయినప్పటికీ, ఉన్నంతలో శాతకర్ణి గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేసి విజయవంతమయ్యామని అన్నారు. ఇదే తరహా చారిత్రక నేపథ్యమున్న మరో చిత్రాన్ని చేయాలని తన అభిమానులు, ప్రజలు అడుగుతున్నారని చెప్పిన బాలయ్య, మంచి స్క్రిప్ట్ లభిస్తే, తప్పకుండా ఇంకో సినిమా చేస్తానని చెప్పారు. కాగా, సినిమాను యుద్ధ సన్నివేశాలతో నింపిన దర్శకుడు క్రిష్ తనదైన కథను చూపించలేదనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.