: తండ్రితో పోరు ఆనందంగా లేదు... కానీ తప్పదు!: అఖిలేష్


తన తండ్రితో పోరాటం చేయడం తనకు ఆనందాన్ని కలిగించే అంశం కాదని, అయినా తప్పడం లేదని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తండ్రితో విభేదించానని చెప్పారు. ఈ ఉదయం తన కార్యకర్తలు, నేతలతో సమావేశమైన ఆయన, తాను నిర్ణయించిన, నేతాజీ (ములాయం) నిర్ణయించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో 90 శాతం పేర్లు ఒకటేనని గుర్తు చేశారు. తండ్రితో తన సంబంధాలు ఎన్నడూ చెడిపోవని భరోసా ఇచ్చారు. ఆయనతో విభేదాలు లేవని అన్నారు. ఇక కాంగ్రెస్ తో పొత్తు విషయం నిర్ణయించేందుకు ఇంకా సమయం ఉందని, ఆ పార్టీతో పొత్తు ఇంకా కుదరలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News