trump: ప్రమాణ స్వీకారం చేశాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవుతా: డొనాల్డ్ ట్రంప్
మరో నాలుగు రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరోసారి రష్యా అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుందని, తమ దేశ అధ్యక్ష ఎన్నికల సమయంలో కంప్యూటర్‌ల హ్యాకింగ్‌కు పాల్పడిందని రష్యాపై అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆంక్షలు విధించిన సంగతి విదితమే. ఈ ఆంక్షలను కొంతకాలం వరకు అలాగే ఉంచుతానని ట్రంప్ చెప్పారు. అయితే, ఉగ్రవాదంపై పోరాటంలో కీలక లక్ష్యాలను చేరుకోవడానికి రష్యా సాయపడితే ఆ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తేయవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే, తాను ప్రమాణస్వీకారం చేశాక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అవుతానని చెప్పారు.