: 24 వారాల గర్భవతి అబార్షన్ చేయించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి
ప్రత్యేక కారణాలతో ఓ యువతి అబార్షన్ చేయించుకునేందుకు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ రోజు కీలక తీర్పు ఇచ్చింది. 24 వారాల గర్భంతో ఉన్న ఓ మహారాష్ట్ర యువతి వేసిన ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం వైద్య నిపుణుల సిఫారసు మేరకు ఆమె అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. కొన్ని కండీషన్‌లను విధిస్తూ ఈ కీలక తీర్పునిచ్చింది.