: కోహ్లీ ఆట బాగుంది... జాదవ్ అత్యద్భుతం: ఆకాశానికెత్తేసిన గంగూలీ


టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కేదార్ జాదవ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. నిన్న ఇంగ్లండ్ తో జరిగిన వన్డే క్రికెట్ పోటీలో జాదవ్ అత్యద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. కోహ్లీ ఆట తీరు బాగుందని, ఇదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం తక్కువగా ఉన్న జాదవ్, ఇంగ్లండ్ వంటి జట్టుపై ఆడిన తీరు అందరినీ కట్టిపడేసిందని అన్నాడు. టాప్ ఆర్డర్ విఫలమై ఒత్తిడితో జట్టు ఉన్న వేళ, కోహ్లీ కన్నా జాదవ్ మెరుగ్గా ఆడాడని చెప్పాడు. అతని కీలకమైన భాగస్వామ్యమే జట్టును విజయతీరాలకు చేర్చిందని, క్రెడిట్ అంతా జాదవ్ దేనని కొనియాడాడు. కాగా, తన సొంత మైదానంలో కుటుంబ సభ్యులు చూస్తుండగా, కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని జాదవ్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News