: కోలుకుంటున్నా... అభిమానులకు ధన్యవాదాలు: ప్రియాంకా చోప్రా


టీవీ షో క్వాంటికో షూటింగ్ లో భాగంగా సెట్స్ లో కిందపడి గాయాలపాలైన నటి ప్రియాంకా చోప్రా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆదివారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ లో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రియాంకా చోప్రా... తాను చక్కగా కోలుకుంటున్నానంటూ, అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేసింది. తాను బాగానే ఉన్నానని, సాధ్యమైనంత త్వరగా షూటింగ్ లో పాల్గొనాలనుకుంటున్నానని చెప్పింది. గత శుక్రవారం న్యూయార్క్ లో క్వాంటికో షూటింగ్ జరుగుతున్న సమయంలో చిన్న ప్రమాదం జరగడంతో ప్రియాంకా చోప్రాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె తలకు గాయం కావడంతో వైద్యులు చికిత్స అందించారు. ప్రియాంకా చోప్రాతో క్వాంటికో టీవీ షో రెండో సిరీస్ ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఈ వారం చివరిలో ప్రియాంకా షూటింగ్ లో పాల్గొంటారని ఆమె ప్రతినిధి ఇప్పటికే ప్రకటించారు.  

<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Thank you for all of your warm thoughts and well wishes.I will be ok, and am looking forward to getting back to work as soon as I can.much❤️</p>&mdash; PRIYANKA (@priyankachopra) <a href="https://twitter.com/priyankachopra/status/820659629202034688">January 15, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  • Loading...

More Telugu News