: భారీ లక్ష్య ఛేదనలో ఆదిలోనే ఎదురుదెబ్బ.. రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
భారత్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ల మధ్య పుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు టీమిండియా ముందు 351 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బతగిలింది. టీమిండియా ఓపెనర్లుగా రాహుల్, శిఖర్ ధావన్‌లు క్రీజులోకి వచ్చారు. అయితే,13 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (1) విల్లే బౌలింగ్‌లో అలీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు. అయితే, వెంటనే 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ కూడా వెనుదిగాడు. కోహ్లీ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా స్కోరు 6 ఓవర్లకి 24గా ఉంది.