: జల్లికట్టు కావాలి... తమిళనాడులో నిరసనలు.. భారీగా పోలీసుల మోహరింపు!
సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టును నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర వ్యాప్తంగా తమిళులు ఆందోళన బాటపట్టారు. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. తమిళులు నల్లజెండాలను ప్రదర్శిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అక్కడి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జల్లికట్టును నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ వ్యాజ్యాన్ని కోర్టు ఈ నెల 12న తోసిపుచ్చడంతో తమిళనాడులో అధికార, ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు.