: ఇద్దరు చంద్రులున్నారు... వారి వెన్నెల పరచుకున్న నేల ఇది: దర్శకుడు క్రిష్


తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్న ఇద్దరు చంద్రులకూ తమ తాజా చిత్రం ఎంతగానో నచ్చిందని 'గౌతమీపుత్ర శాతకర్ణి' దర్శకుడు క్రిష్ వ్యాఖ్యానించాడు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తమ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారని గుర్తు చేస్తూ, ఇద్దరు చంద్రుల వెన్నెల పరచుకున్న నేల ఇదని, లక్ష్మమ్మ పుత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అమ్మణ్ణమ్మ పుత్ర నారా చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రాలు పురోగమిస్తున్నాయని, వారిద్దరికీ కృతజ్ఞతలని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని తనకు ఇచ్చిన బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News