: మచిలీపట్నంలో నడిరోడ్డుపై ప్రియుడి కోసం ప్రియురాలి ఆత్మహత్యాయత్నం


కృష్ణా జిల్లా ముఖ్యపట్టణమైన మచిలీపట్నంలో తాను ప్రేమించిన ప్రియుడి కోసం ఓ ప్రియురాలు నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. తాను ప్రసాద్ అనే యువకుడిని ప్రేమిస్తే, తనను పెళ్లి చేసుకుంటానని ఇంతకాలం చెబుతూ వచ్చిన అతను, ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ, సదరు యువతి నడిరోడ్డుపై కిరోసిన్ పోసుకుని, అగ్గిపెట్టె చేత్తో పట్టుకుని హల్ చల్ చేసింది. మాయమాటలు చెప్పిన ప్రసాద్ తనను మోసం చేశాడని ఆరోపించింది.

ప్రసాద్ తనను వాడుకున్నాడని, కేసులు పెట్టుకోమని బెదిరించాడని, డబ్బులు పడేసి వాడుకున్నానని చెబుతున్నాడని సదరు యువతి ఆరోపించింది. తానిప్పుడు గర్భవతినని, తనకు దారేదని ప్రశ్నించింది. తనను చంపుతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనను మోసం చేసిన ప్రసాద్ ను శిక్షించాలని డిమాండ్ చేసింది. దీంతో స్థానికులు ఆమెపై నీళ్లుపోసి రక్షించారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News