: వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం - విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత


విజయవాడలోని సింగ్ నగర్ లో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం విషయం తెలుసుకున్న వంగవీటి రాధా వర్గీయులు నిరసనలకు దిగారు. ప్రజల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, నేతల సహకారంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు.

విగ్రహాన్ని పడగొట్టిన వారు రంగా అభిమానులకు చిక్కితే పరిస్థితి దారుణంగా ఉంటుందని, ఇక అది వారి కర్మని వంగవీటి రాధా తీవ్ర హెచ్చరికలు చేశారు. తిరిగి ఇదే స్థలంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ధైర్యముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారని వెల్లడించిన ఆయన, ఈ పనికి పాల్పడ్డవారిని ఊరికే వదలబోమని అన్నారు.

  • Loading...

More Telugu News