: ఇష్టం లేకున్నా... సాయి ధరమ్ తేజ్ చెప్పాడని కథ విన్నా: 'శతమానంభవతి'పై శర్వానంద్ చెప్పిన ఆసక్తికర విషయం
తన తాజా చిత్రం 'శతమానంభవతి'పై హీరో శర్వానంద్ ఆసక్తికర విషయం చెప్పాడు. తనకు ఆసక్తి లేకున్నా, చిత్రం కథ విన్నానని అన్నాడు. ఇది తాను చేయాల్సిన చిత్రం కాదని చెప్పాడు. "ఈ సినిమా నేను చేయాల్సింది కాదు. మరో హీరో చేయాల్సిన చిత్రం. ఒక రోజు సాయి ధరమ్ తేజ్ ఫోన్ చేసి ఈ కథ వినమని చెప్పాడు. అంతగా ఇష్టం లేకున్నా, తేజూ చెప్పాడు కదా అని విన్నాను. విన్న తరువాత ఈ కథను వదులుకోకూడదని భావించి సినిమా చేశాను" అని చెప్పుకొచ్చాడు. తనకు 'ప్రస్థానం' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు దేవ కట్టాతో మరో చిత్రాన్ని చేయనున్నట్టు వెల్లడించాడు. అది 'ప్రస్థానం'కు సీక్వెల్ కాకపోయినా, ఆ ఛాయల్లో కనపడుతుందని అన్నాడు.